మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమం వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది.దేశంలో ఎక్కడ లేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమే.ఈ క్రమంలోనే నీలి విప్లవం పథకంలో భాగంగా చెరువులు, జలాశయాల్లో చేపలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లకొలది చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. వాటి ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని మత్స్యకారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు .వర్షాకాలం ప్రారంభం కావడంతో.. మత్స్యకారులు పెద్దెత్తున చేపలను పట్టి మార్కెట్ కు తరలిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలెం చెరువులో చేపలు పడుతుండటంతో సందడి నెలకొన్నది. మత్స్యకారులు టన్నుల కొద్దీ కొర్రమీను, బొచ్చ, రవ్వ వంటి రకాల చేపలను పట్టి లారీల్లో మార్కెట్ కు తీసుకెళ్తున్నారు.గతంలో చెరువులలో చేపల పెంపకం ఉండేది కాదని..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలన గత నాలుగేళ్లుగా మిషన్ కాకతీయతో చెరువులలో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో చేపల పెంపకం పెరిగిందని మత్స్యకారులు, వ్యాపారులు అంటున్నారు.