వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ 185వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం మల్లవరంలో ఆయన బీసీలతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన సంచలన ప్రకటన చేశారు. రాజమండ్రి పార్లమెంట్ సీటు బీసీలకే కేటాయిస్తామని జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. అనంతరం అయన మాట్లాడుతూ..” దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి, బీసీలకు మేలు చేస్తాం. ఫీజురీయింబర్స్ మెంట్‌ను ప్రస్తుత పరిస్థితి నుంచి పూర్తిగా మార్చేస్తాం. వైఎస్సార్ స్వర్ణయుగాన్ని తీసుకొస్తాం. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకేస్తే వైఎస్ జగన్ వారికోసం రెండు అడుగులు ముందు కేస్తారని తెలియజేస్తున్నా. ఏ పెద్ద చదువులైనా.. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా చదివిస్తా. ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా.. వారి హస్టళ్లు, మెస్‌చార్జీల కోసం ప్రతి విద్యార్థికి ఏడాది రూ.20 వేల రూపాయిలిస్తామని హామీ ఇస్తున్నాను. బడికి పంపించిన ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15 వేలిస్తాం. తాము అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయల పెన్షన్‌ను రెండు వేలకు పెంచుతాం. ఎస్సీ,బీసీ, మైనార్టీలకు పెన్షన్ వయసు 45 ఏళ్లకే తగ్గిస్తాం. ఈ విధంగా ప్రతీ బీసీ సోదరుడికి వై సీపీ అండగా ఉంటుంది.”అని అన్నారు.