ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్ జగన్ శనివారం ఉదయం పెరవాలి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మునిపల్లి, పెండ్యాల క్రాస్, కల్వచర్ల, డి ముప్పవరం చేరుకుని వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు.
see also;వైఎస్ జగన్ నిడదవోలులో భారీ బహిరంగ సభ..!
అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి సమిశ్ర గూడెం మీదుగా నిడదవోలు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం నిడదవోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.
see also;
see also: