ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్ జగన్ శనివారం ఉదయం పెరవాలి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర మే నెల 13వ తేదీన పశ్చిమలోకి ప్రవేశించింది. జిల్లాలో ఇప్పటి వరకూ 11నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. దెందులూరు నియోజకవర్గం పెదఅడ్లగాడ గ్రామం వద్ద వైఎస్ జగన్ జిల్లాలోకి ప్రవేశించారు. అనంతరం ఏలూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఏలూరు వెంకటాపురం పంచాయతీ పరిధిలో జగన్ 2వేల కిలోమీటర్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి జగన్ పాదయాత్రకు నిరాజనాలు పలికారు. కాగా శనివారం సాయంత్రం నిడదవోలు పట్టణంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. అందులో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తారు.
see also:వైఎస్ జగన్ 184వ రోజు పాదయాత్ర..!
see also;