వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో నడించేందుకు ప్రజలు వారంతగా వారే ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో 184వ రోజు కొనసాగుతోంది.
see also:వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు విడుదల..!
అయితే, జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో ఎప్పుడూ చేయని విధంగా ఓ సంఘటన చోటు చేసుకుంది. 183వ రోజు పాదయాత్ర చేసిన జగన్కు ఓ అరుదైన సంఘటన ఎదురైంది. ఆ సంఘటనను చూసిన జగన్ చలించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలగూడెం గ్రామానికి చెందిన రాముడికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అంటే ప్రాణం. ఎంతలా అంటే.. వైఎస్ఆర్ మరణించిన సమయంలో తాను కూడా మరణించేందుకు సిద్ధపడ్డాడు.
ఇదిలా ఉండగా, ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తూ తమ గ్రామానికి వచ్చిన జగన్ను చూసేందుకు అనారోగ్యం కారణంగా అతని శరీరం సహకరించలేదు. ఈ విషయం తెలుసుకున్న జగన్.. ఆ వెంటనే కటారి రామును కలిసేందుకు రాము ఇంటికి వెళ్లాడు. దీంతో రాము కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. ఇలా జగన్ చేసిన పనికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు సైతం హ్యాట్సాఫ్ జగన్ అంటూ నినాదాలు చేయసాగారు.
see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..!