వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వెంటే మేమంటూ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తున్నారు.
see also:
అంతేకాకుండా, ఇటీవల కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోనూ పలు సంస్థలు ఎన్నికల సర్వే చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేక భావనను వ్యక్త పరుస్తున్నారని, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగలబోతోందని ఆ సర్వే సంస్థలు ఫలితాలను వెల్లడించాయి.
see also:
ఎన్నికల సర్వే ఫలితాలను విశ్లేషించిన అధికార పార్టీ టీడీపీతో సహా పలు పార్టీలకు చెందిన నాయకులు వైసీపీలో చేరారు. ఇంకా చేరుతున్నారు కూడా. మరికొందరు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన బీసీ జనార్ధన్‌రెడ్డి వైసీపీలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.
see also:వైఎస్ జగన్ 184వ రోజు పాదయాత్ర..!
అయితే, తాజాగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీలో చేరేందుఉ సిద్ధమైపోయారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల కాలంలో చంద్రబాబు సర్కార్‌పై వ్యతిరేకత, అలాగే, గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో అభివృద్ధికి టీడీపీ సర్కార్ నిధులు విడుదల చేయకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేతలు తనను చులకన భావనతో చూడటం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం చంద్రబాబు చుట్టూరా ఎన్నిమార్లు తిరిగినా.. ఫలితం లేకపోవడంతో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తీవ్ర మనస్థాపంతో ఉన్నట్టు సమాచారం. ఇలా చంద్రబాబు సర్కార్ తనపట్ల వ్యవహరిస్తున్న తీరును మొదట్నుంచి గమనించిన మోదుగుల చివరకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో తన అనుచవర్గంతో సమావేశమైన మోదుగుల.. పార్టీ మార్పుపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైసీపీ వైపే మోదుగుల మొగ్గుచూపుతున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.