హత్యా రాజకీయాలు, ఆర్థిక నేరాలు చేసింది ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమానే. స్వర్గీయ వంటవీటి మోహన రంగా హత్య కేసులో మంత్రి దేవినేని ఉమాను ముద్దాయిగా చేర్సాల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రణీతను సైతం చంపి రాజకీయాల్లోకి వచ్చావు అంటూ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై మాజీ హోం మంత్రి వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..!
కాగా, శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండూ అంటూ దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. నాడు అయ్యప్ప డ్రస్ వేసుకుని వంగవీటి రంగా హత్యకు ప్లాన్ చేసింది నీవు కదా..? అంటూ దేవినేని ఉమాపై ప్రశ్నల వర్షం కురిపించారు. అభివృద్ధి పేరుతో నిధులను దోచుకుంటున్నారు. ప్రజలను నట్టేట ముంచుతున్నారు. ఎవ్వరూ ఊహించని రీతిలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో మంత్రి దేవినేని ఉమా అవినీతికి పాల్పడుతున్నారంటూ మాజీ హోం మంత్రి వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.