పశ్చిమగోదావరి జిల్లా దుద్దుకూరులో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ కాకర్ల శ్రీను తన అనుచరులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గురువారం సాయంత్రం వైసీపీలో చేరారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు కాకర్ల శ్రీను, పలువురు టీడీపీ నాయకులకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ దుద్దుకూరులో వైసీపీకి పూర్వవైభవం తీసుకువచ్చి రాబోవు ఎన్నికల్లో మెజార్టీ తీసుకురావాలని ఆయన కోరారు. టీడీపీ ప్రభుత్వ చేసిన మోసాలను తెలుసుకుని ఆ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
see also:ఏపీ అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటుంది-గిడ్డి ఈశ్వరీ ..!
see also:
కాకర్ల శ్రీను మాట్లాడుతూ టీడీపీలో కష్టడే కార్యకర్తలకు గుర్తింపులేదన్నారు. 30 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసినా తనను గుర్తించలేదని వాపోయారు. సర్పంచ్‌గా పనిచేసి ఉన్న ఆస్తిని అమ్ముకున్నానని వివరించారు. టీడీపీ తనకు తీరని అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 12న గ్రామం నుంచి సుమారు 200 మోటారు సైకిళ్లతో ర్యాలీగా కొవ్వూరు వెళ్లి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలపనున్నట్టు చెప్పారు. 1,000 మంది అనుచరులతో టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరుతున్నట్టు వివరించారు. జగనన్న ప్రకటించిన పథకాలు, నాయకత్వానికి ఆకర్షితుడినై పార్టీలో చేరినట్టు తెలిపారు. టీడీపీ నాయకులు కొడవలి శ్రీను, ముద్రగడ అమ్మిరాజు, కొడవటి బుజ్జిబాబు వై సీపీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు కూచిపూడి సతీష్, మండల పరిషత్ ప్రతిపక్ష నాయకుడు గన్నమని జనార్దనరావు, నాయకులు కాండ్రు రామకృష్ణ, పాపోలు కృష్ణ, నిమ్మగడ్డ కృష్ణ, కాకర్ల నాగకృష్ణ, మల్లిపూడి రాంబాబు, వెలగా నాగేశ్వరరావు, సాలి బేబిసరోజిని, యు.రమణ, వై.అచ్చిబాపిరాజు, ఎన్.చౌదరి, ఎస్.కోటి, కార్యకర్తలు పాల్గొన్నారు.
see also:హ్యాట్సాఫ్ జగన్..!
see also: