ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కాగా, కొండాలమ్మ గుడి వద్ద తేనెటీగలు కలకలం రేపాయి. ఒక్కసారిగా అవి దాడి చేయడంతో జగన్‌ను వాటి బారి నుంచి స్థానికులు, పోలీసులు పక్కను తీసుకెళ్లారు. వాటి దాడితో 10 మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాద యాత్రను కొనసాగిస్తున్నారు.
see also:వైసీపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు..!