వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి… ఎనర్జిటిక్, డైనమిక్ కలెక్టర్… వరంగల్ యువతకు ఒక ఐకన్‌లాగా మంచి పేరు సంపాదించుకుంది… ఓ సంప్రదాయిక కలెక్టర్‌లాగా గాకుండా… ఆమె జనంలో కలిసిపోతుంది… ఆలోచనల్లోనూ చురుకుదనం… వేగం … మంచి యాక్టివ్ కలెక్టర్ ..కాని అప్పుడప్పుడు కలెక్టర్ ఆమ్రపాలి చేసిన పనులు కూడ అంతే యాక్టివ్ గా పాపులర్ అయితాయి.
తాజాగా పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలనూ చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ఆమ్రపాలి సూచించారు. ప్రతి స్కూల్లో గ్రంథాలయం ఉండాలని, అందులో విద్యార్థుల స్థాయికి తగిన పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచాలన్నారు. బుధవారం జిల్లాలోని హన్మకొండ న్యూశాయంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన బడిబాట కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నెలకోసారి తల్లిదండ్రులు బడికి వచ్చి తమ పిల్లల చదువుపై ప్రధానోపాధ్యాయుడిని, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. వరుసగా రెండు నెలలు బడులకు రాని తల్లిదండ్రులకు రేషన్, పింఛన్ నిలిపివేస్తామని నవ్వుతూ అన్నారు. ప్రత్యేకించి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల చదువు పట్ల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త తీసుకోవాలని, ప్రతినెల విధిగా పాఠశాలకువచ్చి ఉపాధ్యాయులను కలిసి వారి అభ్యసన స్థాయి గురించి తెలుసుకోవాలని సూచించారు.