సాధారణంగా యుక్త వయసులో ఉన్నయువతీ, యువకులను ఎక్కువగా భయపెట్టేది మొటిమలు.అవి రావడం వల్ల అందంగా ఉన్న ముఖం అధ్వానంగా తయారవుతుంది.అయితే మొటిమలు ఎందుకు వస్తాయి, రాకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మొటిమలు ఎందుకు వస్తాయంటే..
మొటిమలు అనేవి చర్మ సంబంధిత సమస్య. మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నూనే, చనిపోయిన చర్మ కణాలు చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల, ఒత్తిడి, హర్మోన్ల మార్పు, మోనోపాజ్ ఇలా రకరకాల కారణాలుఉన్నాయి.
see also:మీరు ఏసీ వాడుతున్నారా..?
మొటిమలు రాకుండా ఉండాలంటే
- రాత్రి పడుకునేముంది మేకప్‌ను పూర్తిగా తొలగించాలి
- రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
- మేకప్‌ను తొలగించడానికి అల్కహాల్ రహిత మేకప్ రిమూవరన్ని ఉపయోగించాలి. తర్వాత డీప్ పూర్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి.
- ఆరోగ్యకరమైన, తాజా ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, మసాలాలకు దూరంగా ఉండాలి.
- వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.
- ప్రతిరోజు యోగా చేయ్యాలి.
- సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండటానికి సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి.