ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలిశారు.టిటిడిలో అవినీతి, అక్రమాలు, ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా అయన తనకు జరిగిన అన్యాయాన్ని జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. వారసత్వంగా వచ్చిన అర్చకత్వ విధుల నుంచి తమను కావాలనే టీడీపీ ప్రభుత్వం తొలగించారంటూ రమణ దీక్షితులు చెప్పిన విషయాలపైజగన్ సానుకూలంగా స్పందించారు. రమణ దీక్షితులకు న్యాయం చేస్తామని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.కాగా నిక్షేపాల కోసం తిరుమల శ్రీవారి పోటులో కొందరు తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . తవ్వకాలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదని.. ఆ వంట గదిలో జరిగిన మార్పులే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు. గతేడాది డిసెంబర్ 8న రహస్యంగా ఈ తవ్వకాలు జరిగాయని ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమణ దీక్షితులు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.