ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది. మరోపక్క భూమా అఖిలప్రియను తక్షణమే బర్తరఫ్ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ నరసింహన్‌ను కోరిన సంగతి తెలసిందే.
see also:బీజేపీ కొత్త స్కెచ్…బాబు టీంలో వణుకు…తర్వాత ఏంటి?