సాధారణంగా ప్రస్తుతం ఇంట్లో నైనా అఫిసుల్లోనైనా ఫ్యాన్ల కంటే ఏసీ లనే ఎక్కువగా వాడుతున్నారు.ఎందుకంటే ఏసీ క్రింద కుర్చున్నమంటే వేసవి తాపం అస్సలు తెలియాదు.అయితే ఏసీ వల్ల చల్లని గాలి అందే మాట ఎలా ఉన్నప్పటికీ దాని వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
see also:నిమ్మకాయ తో ఎన్ని లాభలో..మీకు తెలుసా..!!
1 కళ్లు పొడి బారిపోయే సమస్య ఉన్న వారు ఏసీల కింద కూర్చోరాదు. దాని వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది.
2 ఏసీ క్రింద కూర్చోవడం వాళ్ళ కళ్లలో స్రవించే ద్రవాల పరిమాణం తగ్గుతుంది. అందువల్ల కళ్లు పొడిబారిపోయి దురదలు పెడతాయి.
3 ఏసీల కింద గంటల తరబడి గడిపే వారికి చర్మం పొడిబారిపోయి దురద పెడుతుంది. ఏసీ కింద ఉండి ఎండలోకి వెళితే చర్మం మరింద పొడిబారుతుంది.
4 ఏసీ వల్ల గదిలో ఉండే తేమ శాతం తగ్గుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.
5 ఏసీ కింద కూర్చోవడం వల్ల నీళ్లు బాగా తాగాలనిపిస్తుంది.
6 గంటల తరబడి ఏసీలో ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి.
7 ఆస్తమా, అలర్జీలు ఉన్నవారు ఏసీల్లో అస్సలు ఉండరాదు. లేదంటే సమస్య మరింత ఎక్కువవుతుంది.
8 ఏసీల్లో ఉండే వారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది.అది మైగ్రేన్‌కు కూడా దారి తీయవచ్చు.