2019 లో జరిగే ఎన్నికల వాతావరణం ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడే కనిపిస్తోంది. పోటి చేసే అన్ని పార్టీలన్నీ ఇప్పుడే హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్య్గంగా ఓవైపు ప్రత్యేక హోదా ఉద్యమంలో బిజీగా గడుపుతూనే మరోవైపు ఆయా నియోజక వర్గాలను చక్కదిద్దుకోవడంపై కూడా దృష్టిపెట్టాయి. అందుకు తగ్గట్టుగా నియోజకవర్గాల వారీగా పరిస్థితిని తమకు సానుకూలంగా మలచుకోవాలనే ప్రయత్నంలో వైఎస్ జగన్ ఉన్నారు. వైసీపీ నుండి అధికారపార్టీలోకొచ్చి చేరిన వారు కొంత అసంతృప్తితో వున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. కానీ.. చంద్రబాబు క్యాంపులో కీలక పదవుల్ని ఎంజాయ్ చేస్తూ.. అత్యంత సౌకర్యంగా వున్న కొందరి పేర్లు సైతం ‘జంపింగ్ జపాంగ్’ల జాబితాలో వుండడం ఆసక్తికరంగా మారింది.
ఈ నెల 6న ఢిల్లీలో ఏం జరగబోతోంది..??
కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం సోదరుల్లో ఒకరు ఇటీవలే మృతి చెందారు. స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నట్లు కొన్నిరోజులుగా గట్టిగా చెబుతున్నారు. ఇటు.. బాబు క్యాబినెట్లో సైతం కొన్ని ‘కోవర్ట్’ ఫేసులున్నాయన్నది తాజా సమచారం. ప్రింట్ మీడియాలో దీనికి సంబంధించి బ్యానర్ కథనాలే వచ్చాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కనీసం ఇద్దరు మంత్రులు త్వరలో వైసీపీలోకి జంప్ కావచ్చన్నది సదరు కథనం సారాంశం. మంత్రులుగా వీళ్లిద్దరి పనితీరు మీద విమర్శలు వెల్లువెత్తడం.. సీఎం తరచూ చీవాట్లు పెట్టడం.. వీటినే అసంతృప్తికి కారణాలుగా చెబుతున్నారు.