ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు కుదురుతుందనే అంచనాలను నిజం చేస్తూ…అందుకు తగిన నిర్ణయం చోటుచేసుకున్నట్లు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖుష్ అయ్యేలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ మహిళా వ్యవహారాల ఇంచార్జీగా తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే సీతక్కను నియమించడం ఇందుకు తార్కాణం అంటున్నారు.
ఏపీలో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడే..!
ఇటీవల కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో దోస్తీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరాటపడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతంతో ఏర్పడిన టీడీపీని ఆ పార్టీతో పొత్తుకు సిద్ధపడేలా చంద్రబాబు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో బాబు రాసుకుపూసుకొని తిరగడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. అదే సమయంలో టీడీపీ నాయకులు సైతం కాంగ్రెస్‌తో పొత్తు విషయం ఖండించలేదు.
ఆ ఒక్క జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీలోకి..ఇక టీడీపీ క్లీన్ స్వీప్
ఇలా టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై చర్చోపచర్చలు సాగుతున్న సమయంలోనే..సీతక్క నియామకం జరిగింది. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల గుర్తింపు కోసం ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ పెద్దలు..తెలంగాణలో క్రియాశీలక నేతగా ఉన్న సీతక్కను ఇంచార్జీగా నియమించారు. తద్వారా ఏపీలో ఆమె క్రియశీలక దృష్టి పెట్టబోరని, దీంతో బాబుకు పెద్దగా ఎదురుదాడి ఎదురుకాదని అంటున్నారు. ఈ రూపంలో టీడీపీ ఇబ్బందిపడకుండా కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని చర్చ వినవస్తోంది.