ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిర్విరామంగా 181వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను జగన్‌కు గుర్తు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలతో తమను మోసం చేస్తాడని ఊహించలేకపోయామని, చివరకు ముఖ్య మంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అటకెక్కించారంటూ జగన్‌కు ప్రజలు చెబుతున్నారు. ఇలా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరణ నడుమ విజయవంతంగా కొనసాగుతోంది.
మరో కుంభకోణం. ఎయిర్ ఏషియా స్కాంలో చంద్రబాబు..?
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పొలిటికల్ సూపర్ స్టార్ అంటూ ఓ సోషల్ మీడియా కథనం పేర్కొంది. ఆ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడు కార్యక్రమంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్త వరకు చెప్పిన మాట ఒకే ఒక్కటే. అదేమిటంటే వైఎస్ జగన్ పొలిటికల్ సూపర్ స్టార్ అని. ఈ విషయం మహానాడులో టీడీపీ నేతల నుంచి కార్యకర్తల వరకు ఇచ్చిన ప్రసంగాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
బ్రేకింగ్ : సంచలన వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఒక్కడే ఏపీలోని పార్టీలన్నిటిని ఎదుర్కొని టీడీపీని విజయంవైపు నడిపిస్తారని మహానాడు వేదికగా టీడీపీ శ్రేణులు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మాటనే జగన్‌ను పొలిటికల్ సూపర్ స్టార్‌ను చేసింది. అయితే, 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఒక్కడు కలిసి రెండు జాతీయ పార్టీలతోపాటు, ఒక ప్రాంతీయ పార్టీని ఎదుర్కొన్నాడు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు అన్నీ కలిసినా కూడా కేవలం 2 శాతం ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అబద్ధపు హామీలు ఇవ్వడం ద్వారా గెలిచే అవకాశం ఉన్నా.. జగన్ అందుకు దైర్యం చేయలేదు. చంద్రబాబులా రాష్ట్ర ప్రజలను వంచించడానికి జగన్ సాహసించలేదు.
వైఎస్ జగన్ 181వ రోజు పాదయాత్ర..!
అయితే, త్వరలో జగరనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్ విజయ దుందుభి మోగించనున్నారు. అందుకు కారణం. పవన్ కల్యాణ్‌కు గతంలో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేకపోవడం, అలాగే, సీఎం చంద్రబాబుపై ప్రజల్లో అపనమ్మకం కలగడం వంటివి జగన్ గెలుపుకు కారణం కాబోతున్నాయంటూ ఇటీవల ఎన్నికల సర్వే సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే.