Home / TELANGANA / 2022 నాటికి తెలంగాణలో ప్లాస్టిక్ నిషేధం.. మంత్రి జోగు రామన్న

2022 నాటికి తెలంగాణలో ప్లాస్టిక్ నిషేధం.. మంత్రి జోగు రామన్న

తెలంగాణ లో 2022 నాటికి ప్లాస్టిక్ ను నిషేదించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న 5 రోజుల జాతీయ సదస్సు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి జోగురామన్న హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ సదస్సులో పాల్గొన్న అనంతరం మంత్రి జోగు రామన్న తెలంగాణభవన్ గురజాడ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ ను నిషేదించే విషయంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో చర్చ జరిగిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ ను నిషేందిచాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్ సూచించారని అన్నారు . తెలంగాణలో ఇప్పటికే 15 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ ను నిషేదించామని, 50 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్నవాటిని నిషేదించాలని భావిస్తున్నామని తెలిపారు.

ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!!

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం కలుషితం అవుతోందని ఆందోళన వ్యక్తం చేసిన జోగు రామన్న, వాతావరణ కాలుష్యం వల్ల రానున్న రోజుల్లో మానవ మనుగడ కి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు అమలుచేస్తున్న కార్యక్రమాలను రెండు రోజుల పాటు సదస్సులో వివరించానని తెలిపారు. తెలంగాణలో వేస్ట్ మనేజ్మెంట్ చేస్తున్నామని, హైదరాబాద్ లో తడి,పొడి చెత్తలను సేకరించేందుకు రెండు బుట్టలను ఆందజేశామని, త్వరలో ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించేందుకు నల్లరంగు ఉన్న డబ్బాలను ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల నుండి రోజుకు వచ్చే 7, 270 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయని అందులో 7053 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేస్తున్నామని తెలిపారు. హైద్రాబాద్ లో ఆసుపత్రులు, నిర్మాణ రంగం, ఇతర రంగాల నుండి వచ్చే వ్యర్ధాలను వేరు వేరుగా సేకరించి శుద్ధిచేసేందుకు సాలిడ్ వేస్ట్ మనేజ్మెంట్ యూనిట్ ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు స్వచ్ తెలంగాణ , స్వచ్ హైద్రాబాద్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జోగురామన్న వెల్లడించారు.

సీఎం కేసీఆర్ దయతో మేం బాగున్నాం..!!

కేంద్రం నుండి రావాల్సిన కాంపా నిధులలో 10శాతం కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని అన్నారు. ఇంకా దీనికి సంబంధించి కేంద్రం నుండి 1400 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ లో ఇంతకు ముందు 23 శాతం ఉన్న గ్రీన్ కవర్ ని 27శాతానికి పెంచామని, దీన్ని 33 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ లో 129 పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, ఇప్పటికే 12పార్కులలో పనులు పూర్తిచేశామని వెల్లడించారు. కేంద్రం కాంపా నిధులు విడుదల చేస్తే, తెలంగాణ వ్యాప్తంగా అడవుల పెంపకాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. దీని కోసం 230 కోట్ల మొక్కలు నాటల్సి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణలో హరితహారం కార్యక్రమం ప్రారంభించామని, ఇందులో భాగంగా 71.50కోట్ల మొక్కలు నాటామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఇళ్లు, సామూహిక ప్రదేశాలలో మొక్కలు నాటామని, ఈ సారి అటవీ భూములలో మొక్కలు నాటుతామని మంత్రి తెలిపారు. మిషన్ కాకతీయ వల్ల జీవన వైవిధ్యం పెరిగిందని, అటవీ ప్రాంతంలో చెరువుల అభివృద్ధికి పర్యావరణ అనుమతులు ఇబ్బందికరంగా మారాయన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అధికారం ఇస్తే, చెరువుల అభివృద్ధితో పాటు చెక్డ్యాంలు,నీటి కుంటలు నిర్మించేందుకు వీలుంటుందని కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ కు వివరించాలని మంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారని జోగు రామన్న తెలిపారు. ఈ సారి హరిత హారం కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు మంత్రి సూచనప్రాయంగా తెలిపారు. గత సంవత్సరం నాటిన మొక్కలలో దాదాపు 70శాతం పైగా మొక్కలు బతికున్నట్లు జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించామని అన్నారు. ఇది హర్షించదగ్గ విషయమని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం విజయవంతం అయినట్లు దీని ద్వారా నిరూపితమైందని జోగురామన్న వెల్లడించారు.

హెచ్ఎండిఏ పైన సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat