ఉల్లిపాయ పొట్టే కదా అని పారేస్తే..అది పొరపాటే..ఉల్లిపాయ పొట్టు తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.ఉల్లిపాయ పొట్టు వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా౦.
1. ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ పొట్టు తీసేసి ఆ నీటిని మన బాడీపై ఎక్కడైనా రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి.
జూ.ఎన్టీఆర్‌కు పాప..! అసలు మేటర్ ఇదే భయ్యా..!!
2. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి. అనంతరం ఆ పాత్రను కిటికీలు లేదా గుమ్మం వద్ద పెడితే ఇంట్లోకి దోమలు, ఈగలు రావు.
3. తలస్నానం చేసేటప్పుడు జుట్టును నీటితో కడిగి షాంపూ పెట్టకముందే ఉల్లిపాయ పొట్టుతో బాగా మర్దనా చేయాలి. దీంతో వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
మీ వెంట్రుకలు రాలి పోకుండా ఉండాలంటే..ఈ చిట్కాలు పాటించండి..!
4. ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. అంతేకాకుండా తద్వారా అధిక బరువు తగ్గడమే కాదు, గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
5. పైన చెప్పిన విధంగా ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి.