తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మాతా శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అమ్మ ఒడి ,కేసీఆర్ కిట్లు లాంటి పలు పథకాలను ప్రవేశపెట్టింది .ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడు ,కరుడుగట్టిన టీఆర్ఎస్ పార్టీ సైనికుడు ,సోషల్ మీడియాలో యాక్టివ్ నెటిజన్ అయిన తెలంగాణ విజయ్ (తాడేబోయిన విజయ్ )కేసీఆర్ కిట్ పథకం మీద సర్వే చేశారు .ఉన్నది ఉన్నట్లు మీకోసం ”
అక్కడ కేసీఆర్ కిట్ ఆ చెల్లెమ్మకు ఇస్తుంటే ఆమె కళ్ళల్లో చూసారా ఉభికి వస్తున్న ఉద్వేగం,ఆనందం,దైర్యం ఆ తల్లి కళ్ళల్లో కనిపిస్తున్నాయి.ఈ భరోసానే తెలంగాణా కోరుకుంది.గరీబులు ఘనంగా బ్రతకాలె ఇదే కేసీఆర్ గారి లక్ష్యం..
పగిడీలు చుడితే అధికారం వస్తుందా..? ఎమ్మెల్యే కె.పి.వివేకానంద
నిన్న మా ప్రెండ్ కొడుకును చూసేందుకు ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ ఎల్లిన అక్కడ ఒక బాలింత తన చెల్లెతో మాట్లాడుతుంటే ఇన్న సంబాషణ..కళ్ళల్లో నీళ్ళు తిరిగినయ్..
అది మీముందుంచుతున్న…
—————————————–
ప్రభుత్వం ఇచ్చిన కేసీఆర్ కిట్ ఓపెన్ చేసి చూస్తూ
”అమ్మో గిన్ని వస్తువులున్నయ్ చెల్లే నా బిడ్డ కు గా సారు ఇచ్చిండు సారు సల్లగుండాలె. గిసొంటియి ఎప్పుడు వాడలే శెల్లే తొలుసూరు కానుపు అవ్వోల్లు నాకు డబ్బులు పెట్టనీకి అరిగోస పడ్డరు కదా ”
“”అవునక్క ఇంట్ల రూపాయి లేకుండే అవ్వ సంపాయించినయ్ అయ్య తాగుడుకు ఖర్సు పెట్టె ఇంగ రూపాయి లేక నిన్నూకె గునిపిస్తుండే పాపం తర్వాత అవ్వ బాదపడేదక్క ఏడ్శేది”
“”నిజమే చెల్లే నా కొడుకు పుట్టినప్పుడు గా దోమలు కుట్టకుండ పర్ద కొనవ్వ అంటే అస్సలు కొనకపాయే,అన్ననడిగితే వదిన గద్దిచ్చిపెట్టంగనే తప్పిచ్చుకునేటోడు నాకొడుక్కు పూద్దం అంటే మంచి పౌడర్ డబ్బి గూడ కష్టంగ కొనుక్కునేది అయ్య సంపాదించక అవ్వ రెక్కల కట్టం మీద బ్రతికితిమి రూపాయి రూపాయి పోగుచేసి పెళ్ళి చేసిందవ్వ ,నా తొలుసూరు కాన్పప్పుడు ఖర్సుకు అరిగోస పడ్డది చెల్లే అవ్వ”
”అవునక్క అన్నదగ్గర సూత పైసలేడున్నయే వాడు పంటకు పెట్టుబడి పెట్టే టైంకు నువ్ డెలివరైతివి ”
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉన్నతాధికారులు..!!
అవును చెల్లి ఇప్పుడు నా మలుసూరు కాన్పు కు గా కేసీఆర్ సారు గివి కొనిచ్చి జర ఆసరైండు.గివన్నీ నేనేడ కొందును చెల్లే. ఆ సారు సల్లంగ ఉండాలె చెల్లే,ఇయ్యాల నా బిడ్డకోసం ఓ బ్యాగిచ్చిల్లు అందుల నా బిడ్డకు దోమ తెర,సబ్బు,నూనె,మంచి కంపెని పౌడర్ డబ్బ నాకు రెండు శీరెలు గిట్ల పదహారు వస్తువులున్నయ్ మస్తు సంబరమనిపిచ్చిందే పుట్టెరిగి గిన్ని సూడలే చెల్లె ఎన్నడు. మన అవ్వ అరిగోసల పడ్డది తొలుసూరు కాన్పప్పుడు ఇప్పుడు గా తెలంగాణా సారు జర మనకు ఆసరైనట్టే చెల్లే ఎన్నిసార్లైన ఆయనే గెల్వాలె శెల్లె..(కళ్ళ నిండ తిరిగిన నీళ్ళతో)”
”అవునక్క అట్లనే గర్బం దాల్చినప్పటిసంది డెలివరయ్యేదాంక నాలుగు వంతుల మొత్తం 12000ఇస్తరటక్క నిన్ను తొలుసూరు కాన్పప్పుడు ప్రైవేట్ల చూపిత్తె 15000ఐనయ్,అవ్వ నెల నెల వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాల్లు మొక్కి పైసల్ తెచ్చేటిది,ఊకె రందిపడేదక్క అవ్వ”
”నిజమే శెల్లే మనకంటే ఇంక తక్కువున్నోల్లున్నరు గవాళ్ళ పరిస్థితి ఇంక దారుణముంటది.నిజంగా దిక్కులేనోల్లకు పెద్దదిక్కైతండు శెల్లే గా సారు.గిట్ల ఎనకటి సంది ఎవ్వరు ఆలోచన చెయ్యలే,ఇంటికి పెద్దన్న లెక్కైండు సారు””
—————————————–
ఇది కల్పితం కాదు వాస్తవంగా వాళ్ళు సంబాశించుకుంటుంటే నేను గమనించా …గ్రామీణ ప్రాంతాల్లొ జనరల్ గా ఒక సాంప్రదాయం ఉంటది.తొలుసూరు(మొదటి)కాన్పు తల్లిగారు ఖర్చు ,మలుసూరు(రెండవ)కాన్పు అత్తగారు ఖర్చు పెట్టుకోవాలె.
ఐతే అప్పటికే ఆ అమ్మాయి పెళ్ళి చేసిన ఆ తల్లిదండ్రులు పెళ్ళైన ఏడాదిలో ఈ కాన్పు ఖర్చు మీద పడుతుంది.అప్పటికే పెళ్ళి ఖర్చు ఐ ఉంటది.వెంటనే ఈ ఖర్చు రావటం వాల్లను ఊపిరి సలుపుకోనివ్వదు.వాళ్ళకు కూతురుపై ప్రేమ లేక కాదు దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితి,అప్పటికే అప్పుల్లో కూరుకుపోవడం వల్ల వారు తమ కూతురికి ,అప్పుడే పుట్టిన పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించాలన్నా చేయలేని వారి ఆర్థిక స్థితి.
రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు..!!
ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకున్న ఈ ”అమ్మ ఒడి” నిర్ణయం ఎంత గొప్పదో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఆడభిడ్డలే చెప్తారు.వారి ఇంట ఒక అన్నలా కేసీఆర్ గారు ఉన్నారని దైర్యంగా ఫీలవుతున్నారు.ఎవరిదగ్గరా చేయి చాచాల్సిన పనిలేదని దైర్యంగా ఉన్నారు.ఈ నిర్ణయం పేద వారికి ఒక వరంలాంటిది.దోమల తెరకు డబ్బులు లేక సుట్టూ చీరలు కట్టి మద్యలో బిడ్డను పడుకోబెట్టిన సంఘటనలను నేను ప్రత్యక్షంగా అనుభవించా, గ్రామీణ ప్రాంతాల్లో పేద వాళ్ళకు ఇలాంటివి తలకుమించిన బారం ఇవన్నీ ”కేసీఆర్” కిట్ ద్వారా అందించడం గొప్ప నిర్ణయం.
ఇంటింటా కేసీఆర్ ను తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు తెలంగాణా ఆడబిడ్డలు.పేదింటికి పెద్దన్నగా మారిన కేసీఆర్ కు శతకోటి వందనాలు,పాదాభివందనాలు.
— తెలంగాణా విజయ్..