రైతుల సంక్షేమం పట్ల టీడీపీ నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ.. వైసీపీ పార్టీ రైతులతో కలిసి కదం తొక్కింది. కడప జిల్లాలోని రాజోలి ఆనకట్టను నిర్మించాలనీ, కేసీ కెనాల్‌కు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్‌లతో రైతులు, వెసీపీ నాయకులు రాజోలి ఆనకట్ట నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. రాజోలి ఆనకట్టను నిర్మించి కేసీ కెనాల్ రైతులకు న్యాయం చేయాలన్నారు.
see also….
ఆ ఒక్క జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీలోకి..ఇక టీడీపీ క్లీన్ స్వీప్
2008లో వైఎస్సార్ శంకుస్థాపన చేసిన రాజోలి ఆనకట్టను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా ఆనకట్టను నిర్మించడం లేదని మండిపడ్డారు. జిల్లాలోని సగం నియోజకవర్గాలకు నీరందించే రాజోలి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం తగదని వ్యాఖ్యానించారు. బుధవారం కడపలో పర్యటించనున్న చంద్రబాబుకు కనువిప్పు కలిగేందుకు ట్రాక్టర్‌లతో ర్యాలీ నిర్వహించామని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. అయితే ఈ వీడియో చూసిన వైసీపీ అభిమానులు కడపలో ఎలా..టీడీపీ జెండా ఎగురుతుందని అంటున్నారు.
దువ్వూరు నుండి కడప కలెక్టరేట్ వరకుగౌ' శ్రీ ఎమ్మెల్యే 'శెట్టిపల్లి రఘురామిరెడ్డి'గారి ఆధ్వర్యంలో "రాజోలి జలాశయా సాధన యాత్ర " కార్యక్రమంలో భాగంగా భారీగా ట్రాక్టర్ ల ర్యాలీ కార్యక్రమం జరుగును ఈ యాత్ర కి ముఖ్య అతిధిలుగా మన గౌ '' శ్రీ ఎంపీ వైస్. అవినాష్ రెడ్డి గారు మరియు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు, కడప పార్లమెంట్ జిల్లా అద్యేక్షులు సురేశ్ బాబు గారు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా గారు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు, విచేస్తున్నారు కావున ఈ కార్యక్రమంలో రైతు సోదరులు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంచేయాల్సిందిగా కోరుతున్నాము.
Publiée par Jagananna ki Thoduga- Kadapa sur lundi 4 juin 2018