గడిచిన ఆదివారం సాయంత్రం నుంచి అటు సోషల్ మీడియాతోపాటు.. ఇటు పలు వెబ్సైట్లలోనూ ఓ వార్త సంచలనం అవుతూనే ఉంది. అదే నట రుద్రుడు, జూనియర్ ఎన్టీఆర్ పండింటి పాపకు తండ్రి అయ్యాడని. అయితే, సోషల్ మీడియాతో ఈ వార్తను చూసిన జూనియర్ ఎన్టీఆర్కు ఫోన్ చేసి సన్నిహితులు.. ఎన్టీఆర్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడం మొదలు పెట్టారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ దంపతులకు పాప పుట్టిందని అటు తారక్ కుటుంబం నుంచికానీ.. ఇటు హరికృష్ణ కుటుంబం నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు.
టాప్ సినీ డైరెక్టర్స్ ఒకే చోట..ఎందుకంటే..?
ఇలా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ పీఆర్వో స్పందించారు. అయితే, ఎన్టీఆర్ దంపతులకు పండంటి పాపకు జన్మనిచ్చారన్న వార్త నిజమా..? అబద్ధమా..? అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. అయితే, లక్ష్మీ ప్రణతికి ఇంకా డెలివరీ కాలేదని, అందుకు టైమ్ పడుతుందని ఇప్పటికే వైద్యులు సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిపాడు. ఆ వార్త నిజమే అయితే జూనియర్ ఎన్టీఆరే తెలియజేస్తాడని పీఆర్వో చెప్పాడు. ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి కూడా తమ ఇంట్లోకి మరో కొత్త సభ్యులు వస్తున్న తరుణంలో బీమవరంలోని మావుళ్లమ్మ తల్లి ఆలయంలో పూజలు చేయించారని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకున్నారని సమాచారం.