జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పేరుతో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి రోజు పవన్ కల్యాన్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఆ మరుసటి రోజు నుంచి ప్రజల నుంచి స్పందన తగ్గుతూ వస్తోంది.
see also…
సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత సవాల్..!
అయితే, ప్రజా స్పందన తగ్గుతూ వస్తుండటాన్ని గమనించిన పవన్ కళ్యాణ్.. తాను నిర్వహించే సభలలో ఆశించిన స్థాయిలో ప్రజలు లేకపోవడంతో జనసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి బస్సు యాత్ర చేస్తుంటే ప్రజలను తరలించలేకపోవడం ఏమిటని జనసేన నేతలను పవన్ నిలదీశాడు. అసలే ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు నిర్ణయించాను. పార్టీ కోసం ఇంత కష్టపడుతుంటే.. మీరు మాత్రం ప్రజలను తరలించలేకపోవడం సిగ్గుచేటు అంటూ జనసేన నేతలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మాచారం. ఒకానొక సమయంలో జనసేన నేతలపై పవన్ తన చేతిలోని వాటర్ బాటిల్‌ను విసిరేశాడట. ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
see also…
ఈ వీడియో చూస్తే కడపలో ఎలా..టీడీపీ జెండా ఎగురుతుందో..