ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఆ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలకు మరో 14 నెలలు గడువు ఉన్నప్పటికీ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ వీడియో చూస్తే కడపలో ఎలా..టీడీపీ జెండా ఎగురుతుందో..
అయితే, పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను తమ రాజీనామాలను ఆమోదించాలని మళ్లీ రేపు కోరుతామని తెలిపారు. నాడు పార్లమెంట్ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయకుండా డ్రామాలు ఆడారన్నారు. సీఎం చంద్రబాబుకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. ఉప ఎన్నికలకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా..? అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.