ఏపీ ముఖ్యమంత్రి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి జోకులు పేల్చేశారు.నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే .తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక మార్పులకు కారణం నేనే ..తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నేనే పునాది వేశాను .నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేస్తాను అని ఇలా పలు మార్లు మాట్లాడి సోషల్ మీడియాలో నెటిజన్ల చేత సెటైర్లు వేయించుకున్న సంగతి తెల్సిందే .
ఏపీలో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడే..!
తాజాగా మరోసారి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ సాక్షిగా అడ్డంగా బుక్ అయ్యారు .ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో తనకు నలబై లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు అంటూ ఒక ట్వీట్ చేశారు.అయితే ఇటివల ట్విట్టర్ లో ఉన్న ప్రముఖుల ఖాతాలలో ఫాలోయర్స్ పై ఒక ప్రముఖ సంస్థ సర్వే నిర్వహించిన సంగతి తెల్సిందే .
see also…
ఆ ఒక్క జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీలోకి..ఇక టీడీపీ క్లీన్ స్వీప్
ఈ సర్వేలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాత్రమే జన్యున్ ఫాలోయర్స్ ఉన్నారని ..ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడుకు ఉన్న ఫాలోయర్స్ జన్యున్ కాదు అని తేల్చేసిన సంగతి తెల్సిందే .తాజాగా నారా చంద్రబాబు నాయుడు తనకు నలబై లక్షలమంది ఫాలోయర్స్ ఉన్నారని చేసిన ట్వీట్ పై నెటిజన్లు ఆఖరికి ట్విట్టర్ ను కూడా వదలవా బొమ్మాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు ..
see also…