2022 సంవత్సరంలో కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు .పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో పని చేస్తున్నామని అయన చెప్పారు. ఈ రోజు పలు రాష్ట్రాలకు చెందిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన పలు విషయాలను వారితో పంచుకున్నారు.కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ ,అభివృద్ధి పథకాలను రూపొందిస్తుందని అన్నారు .కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం దేశ ప్రజలకు మేలు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.గ్రామాల విద్యుదీకరణ, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన వంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ.
