ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిపై మనం చెప్పే స్వాగతంతో చరిత్ర పునరావృతం కావాలి. 2003లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వాగతాన్ని గుర్తు చేసేలా ఏర్పాట్లు చేద్దాం. పాదయాత్రలో పార్టీ యువజన విభాగమే కీలకపాత్ర పోషించాలి’అని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. స్థానిక ఆనంద్ రీజెన్సీలో ఆదివారం ‘ప్రజా సంకల్పయాత్ర’పై యువజన విభాగం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జక్కంపూడి రాజా మాట్లాడారు. 15 ఏళ్ల క్రితం వైఎస్ ప్రజా ప్రస్థానం పాదయాత్రకు చెప్పిన స్వాగతంపై ఇప్పటికీ ప్రతి రాజకీయ సభల్లో గుర్తు చేసుకుంటారన్నారు.
ఆ 77 సీట్లు వైసీపీ ఘన విజయం సాధిస్తుంది.. శిల్పా చక్రపాణిరెడ్డి
ప్రజా సంకల్ప యాత్రకు ఇచ్చే ఘన స్వాగతాన్ని కూడా భవిష్యత్తులో చెప్పుకోవాలని అన్నారు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను భవిష్యత్తులో ప్రజలు చెప్పకునేటప్పుడు ముందుగా రాజమహేంద్రవరంలో పలికిన స్వాగతమే గుర్తుకు రావాలన్నారు. ఈ స్వాగతం ద్వారా ఎన్నికలపై రాష్ట్రానికి సందేశం పంపాలని, ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్లి పాదయాత్రకు హాజరుకావాలని ఆహ్వానించాలని ఆయన కోరా రు. అంతేగాక జగన్ కు జిల్లాలో స్వాగతం చెప్పేందుకు యువత ఉవ్విళ్లూరుతోందన్నారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల నుంచి యువత తరలివస్తారని వైసీపీ నేతలు అంటున్నారు.