గత వరం రోజులనుండి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. నైరుతి రుతుపవనాలు.. తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో మోస్తారు వానలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ స్థాయిలోనూ వర్షాలు కురవనున్నట్లు చెప్పారు.ఐతే రైతన్నలు ఇప్పటికే విత్తనాలు నాటేందుకు సిద్దమయ్యారు.గతేడాది కంటే ఒక వారం రోజుల ముందే వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
