ఏపీలో వైసీపీ బలం రోజు రోజుకు అంతకు అంత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. గడిచిన 4 ఏళ్లుగా టీడీపీ పాలనపై ప్రజల్లో వీపరీతంగా వ్యతిరేకత రావడంతో వైసీపీ వైపు గాలీ మళ్లింది. సామన్య ప్రజలకే కాదు ..టీడీపీ ,బీజేపి, కాంగ్రెస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు, ఏంపీ,ఎమ్మెల్సీలకు ఇలా ప్రతి ఒక్కరు వైసీపీ వైపు చూస్తున్నారు..మరి కొందరు ఆల్ రెడి వైసీపీలో చేరిపోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైసీపీలోకి చేరుతున్నట్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు అసెంబ్లీకి పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వారిద్దరి కలయికతో.. చంద్రబాబుకు ఇక చుక్కలే..!
అది కూడా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతానని అంటుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 2009 ఎన్నికల్లో అవంతి శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కాగా.. భీమిలి వైసీపీ ప్రధాన కార్యదర్శి జి.వెంకటరెడ్డి ఆ నియోజకవర్గం పార్టీ వాట్సప్ గ్రూప్‌లో శుక్రవారం ఒక పోస్టు పెట్టారు. అవంతి శ్రీనివాసరావు వైసీపీలోకి రాకుండా అడ్డుకోవాలన్నది ఆ పోస్టు సారాంశం. దీనినిబట్టి వైసీపీ నాయకత్వంతో అవంతి సంప్రదింపులు జరుపుతున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అంటే వైసీపీలోకి చెరాడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది…మరి ఇది కాని జరిగితే విశాఖలో వైసీపీ బలానికి..ఆ గాలీకి స్పీడ్ కు .. టీడీపీ తట్టుకుంటుందా అని ఒక్కటే చర్చ జరుగుతుంది.