ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన శాసనమండలి పక్ష నేత ,కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు .నిన్న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వంచన వ్యతిరేక దినాన్ని జరిపిన సంగతి తెల్సిందే .
ఈ క్రమంలో వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో నిర్వహించిన దీక్షలో సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .ఈ క్రమంలో ఆయన ప్రసంగించిన తర్వాత వడదెబ్బకు గురయ్యారు .
ఈ విషయాన్నీ గుర్తించిన వైసీపీ నేతలు ఉమ్మారెడ్డిని నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు .ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది .గత నెలరోజులుగా విరామం లేకుండా చేసిన పని ఒత్తిడి కారణంగా ఇలా అస్వస్థతకు గురయ్యారు అని వైద్యులు తెలిపారు ..