తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఖమ్మంలో పి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారం వలన నిరుద్యోగ యువకులు పడుతున్న బాధలకు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వాస్తవానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీగారి క్యాంపు కార్యాలయం నుండిగానీ, పి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి పత్రికల్లో గానీ, సోషల్ మీడియాలోగానీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకునే చొరవ యవత్ భారత దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడుగానీ, ప్రజాప్రతినిధి గానీ తీసుకోరు. గతంలో నిరుద్యోగ యువత కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉచితంగా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకున్న వారిని దృష్టిలో ఉంచుకొని మూడు నెలలపాటు సుమారు 2800 మందికి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి అందులో 12 మంది ఎస్సై, 320 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించేందుకు తనవంతు కృషి చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.
ఇక నిరుద్యోగ యువత కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో చేయాలనే ఉద్దేశ్యంతో జాబ్ మేళా నిర్వహించాలని అనుకున్నప్పటికీ తేదీనిగానీ, స్థలాన్నీ గానీ ప్రకటించలేదు. పైగా సోషల్ మీడియల్లో వస్తున్న పోస్టులకి ఎప్పటికప్పుడు ఆయన కార్యాలయ వర్గాలు స్పష్టత ఇస్తూనే వచ్చారు. ముఖ్యంగా ఎంపీ కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి మే 27వ తేదీనే పత్రికా ప్రకటన విడుదల చేసారు. నిరుద్యోగ యువత జాబ్ మేళా ఉందనే దృక్పథంతో ఖమ్మం వచ్చి ఆర్థిక, శారీరక ఇబ్బందులకు గురికావొద్దు, త్వరలోనే జాబ్ మెళ నిర్వహించే తేదీని, స్థలాన్ని ప్రకటిస్తామని ప్రకటన కూడ విడుదల చేసారు.అయితే ఈ విషయంపై కొందరు రాజకీయాలకు పాల్పడుతూ పొంగులేటిని దెబ్బతీసేందుకు యువతను రెచ్చగొట్టే ధోరణి అవలంబించడం బాధాకరం. పేద కుటుంబాలకు చెందిన యువతకు ఎంతో కొంత మేలు చేసే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై బురద జల్లే ప్రయత్నాలు మానుకొని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది.