వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొనసాగుతుంది. అయితే, జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతూ.. జగన్ అడుగులో అడుగు వేస్తుండటం గమనార్హం. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను పలుకరిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తూ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జగన్ తన పాదయాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర చేస్తూ తమ నియోజకవర్గానికి వస్తున్నారని తెలుసుకున్న దెందులూరు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ విషయం తెలిసిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందన్న విషయం పై చిన్నపాటి సర్వే చేయించారట.
ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు ఫోన్
ఆ సర్వేలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. అందుకు కారణం, దెందులూరు నియోజకవర్గ అభివృద్ధిని చింతమనేని పట్టించుకోకపోవడం, అలాగే, మహిళలపై చింతమనేనితో సహా తన అనుచరులు చేస్తున్న దాడులేనట. ఈ విషయాలను సర్వే సందర్భంగా ప్రజలే చెప్పారు. దీంతో త్వరలో జరనున్న సార్వత్రిక ఎన్నికల్లో దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలన్న ఆలోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు.
చంద్రబాబు సర్వే చేయించారన్న విషయం తెలుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఒక వేళ తనకు మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు విముఖత చూపితే.. తన భార్య రాథా రాణిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారట. ఆ క్రమంలోనే తన భార్య రాథా రాణికి రాజకీయాలపై అవగాహన కల్పించే పనిలో చింతమనేని ప్రభాకర్ ఉన్నట్టు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.