ఇప్పుడు ఏపీలో టీడీపీ వ్యతిరేక గాలి ఊపందుకుంటోంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో బాబుకు ఇక ఛాన్స్ లేనట్టే అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా పోరాటం అంటూ ఏదో హడావుడి చేస్తున్నా.. ఇవేవీ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి దూసుకుపోతుండటంతో వచ్చేది జగనే అనే అభిప్రాయాలు బలపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది రాజకీయ నేతలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
See Also:మే 5న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ..!
అయితే వచ్చేవాళ్లను చేర్చుకుంటేనే జగన్ మోహన్ రెడ్డి, ఇందులో కూడా వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. వస్తామన్న ప్రతివాళ్లనూ చేర్చేసుకోకుండా జగన్ కాస్త ఆలోచించి, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి కొంతమంది చేరికలకు కూడా జగన్ నో చెబుతున్నట్టుగా తెలుస్తోంది.ఇలాంటి వారిలో ఒకరు.. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఈయన కొన్నాళ్ల కిందట తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి వైసీపీ విజయం సాధించింది. గెలిచిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలుగుదేశంలోకి ఫిరాయించాడు. దీంతో చంద్రబాబు అన్నా రాంబాబును పక్కన పెట్టాడు. ఈ నేపథ్యంలో వేరే దారి చూసుకోవడంలో భాగంగా అన్నా రాంబాబు వైసీపీలోకి చేరే యత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి జగన్ నిరాకరించినట్టుగా సమాచారం.
See Also:వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
స్థానిక రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు, అన్నా రాంబాబుకు ఉన్న బ్యాడ్ ఇమేజ్.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జగన్ ఆయన చేరిక అవసరం లేదని స్పష్టం చేసినట్టుగా సమాచారం. వస్తున్నారని అందరినీ చేర్చుకోకుండా ఎంపిక చేసుకుని నేతలకు పార్టీ తీర్థం ఇస్తున్నాడు వైసీపీ అధినేత. అన్నా రాంబాబు ఒక మహిళపై జరిగిన ఘర్షణ కేసులో ఐదు సంవత్సరాలు జైలు శిక్షపడింది. ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్న ఆయన ..కేసు నిమిత్తం పై కోర్టును ఆశ్రయించలేదు. మరి రాబోయే ఎన్నికల్లో అన్న రాంబాబు పోటీ చేయోచ్చా..? లేదా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కోర్ట్ లో దోషిగా తేలి మూడేళ్ళు జైలు శిక్ష పడితే సెక్షన్ 8 (3) of R.P. Act, 1951 ప్రకారం అతను ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి అనర్హుడు. బెయిల్ మీద బయటకు వచ్చి అతని అప్పీల్ ఇంకా పెండింగ్ లో ఉన్న కూడా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయకూడదు.
See Also:ఈ ఒక్క సంఘటన చాలు వైఎస్ భారతి ,జగన్ ఏమిటో చెప్పడానికి ..!