ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో సహా టీడీపీ నేతల మొఖాల్లో కళ తప్పింది. 2014 ఎన్నికల్లో అమలు కాని, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను వంచించి, ప్రలోభపెట్టి వైఎస్ జగన్‌పై అసత్య ప్రచారం చేసి మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. 2019 ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బే తగలనుంది. ఇందుకు కారణం లేకపోలేదు మరీ.
see also : వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
2014లో మోసపూరిత హామీలతో సీఎం పీఠం దక్కించుకున్న చంద్రబాబు నాటి నుంచి నేటి వరకు ఏపీలో ప్రభుత్వం చేపట్టిన ప్రతీ పనిలోనూ పచ్చబ్యాచ్ నేతలకు వాటాలను పంచిపెడుతున్నారు. చిన్న చిన్న గ్రామాల్లోని చెరువుల నుంచి పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు వరకు మట్టిని తవ్వి అమ్ముకోవడంతోపాటు.. ఇసుక ఫ్రీ అంటూ టీడీపీ నేతలకు, కార్యకర్తలకు లాభాపేక్ష సమకూరేలా ప్రణాళికలు రచించారు చంద్రబాబు.
ఇదిలా ఉండగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పెట్టిన శ్రద్ధ, డబ్బు.. ఏపీ అభివృద్ధి కోసం పెట్టి ఉంటే.. ఈ పాటికి అమరావతి హైదరాబాద్‌ను మించి అభివృద్ధి చెంది ఉండేదన్నది రాజకీయ నాయకులు అభిప్రాయం. నాడు చంద్రబాబు కోట్లు మూటలు చూపి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటే.. ఇప్పుడు ప్రజల సమస్యల పరిష్కార అధ్యయనానికి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ప్రజాదారణను చూసిన అధికార పార్టీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాలన్నిటిని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. 2014 ఎన్నికల్లో తరువాత సీన్… 2019 ఎన్నికల ముందుకు రిపీట్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.