సాధారణంగా మనం రోజు వంటల్లో అల్లం వాడుతూ ఉంటాం.అల్లం వంటలకు రుచినిచ్చే పదార్థంగానే కాక ఇది మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది . ఈ క్రమంలోనే నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం సేవిస్తే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- అల్లం రసం రోజు పరగడుపునే త్రాగడం వలన వయస్సు మీద పడడం కారణంగా వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- నిత్యం అల్లం రసం సేవించడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి (హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.
- చాలా మందికి ఉదయం నిద్రలేవగానే లేదంటే రోజులో ఇతర సందర్భాల్లోనూ వికారంగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే ఉదయాన్నే పరగడుపున అల్లం రసం తాగాలి. దీంతో ఫలితం ఉంటుంది.
see also :
రోడ్లపై ఉండే చెరుకురసం త్రాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం
- స్త్రీలకు రుతు సమయంలో కలిగే తీవ్ర రక్తస్రావం, కడుపునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలగాలంటే రోజూ అల్లం రసం తీసుకోవాలి.
- అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
- అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ సమస్యలు పోవాలంటే నిత్యం అల్లం రసం సేవించాలి.
- అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కండరాల నొప్పులను కూడా తగ్గిస్తాయి.