జీవితా రాజశేఖర్ సంబంధించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాలు ..సంధ్య
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదంపై పీవోడబ్ల్యూ నేత సంధ్య చేసిన తీవ్ర ఆరోపణలపై జీవితా రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే… అయితే జీవిత వ్యాఖ్యలపై చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు సంధ్య… నా దగ్గర జీవితకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు చాలా ఉన్నాయని… పోలీసు కేసు పెట్టింది కాబట్టి అక్కడే వివరాలు అందజేస్తానని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది సంధ్య వర్సెస్ జీవిత కాదు… సినీ ఇండస్ట్రీలో మహిళలను అన్ని రకాలుగా అన్యాయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు సంధ్య . సమస్యను పక్కదారి పట్టిస్తున్నారాని… కాస్టింగ్ కౌచ్ లో జీవిత కూడా భాదితురాలేనన్న సంధ్య… జీవిత విషయం మాకు ఎప్పుడో తెలుసని… కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడే అర్హత జీవితకు ఉందా? అని ఆమె ప్రశ్నించారు.
కమిట్ మెంట్ ఒక్కరితో సరిపెట్టడం లేదన్నారు సంధ్య… ప్రొడ్యూసర్, ఫైనాన్సర్, రాజకీయ నేతలు, బడా బడా నేతలు ఆర్టిస్టులను వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కమిట్ మెంట్ అడిగితే చెప్పుతో కొట్టండని మా పిలుపు నివ్వాలని కోరాం… మా అసోసియేషన్ ప్రతినిధులు సంప్రదింపులు చేస్తున్నామన్నారు. సాటి మహిళగా కాష్ కమిటీ వద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన సంధ్య… నువ్వు ఇండస్ట్రీకి మహారాణివి కావొచ్చు… నీ నోటికి భయపడి నీ కూతురు జోలీకి ఎవరూ రాకపోవచ్చు…. కానీ, సామాన్య మహిళా కళాకారుల పరిస్థితి ఏంటి? అన్నారు. ఇండస్ట్రీలోకి చాలా మంది మహిళలు వస్తుంటే వెనక్కి పంపిస్తున్న అంటున్న జీవిత… ఇండస్ట్రీలో ఏం ఇబ్బందులు ఉన్నాయని వెనక్కి పంపించారో చెప్పాలన్నారు.