ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఒక్క రోజు దీక్షకు అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీని కోసం ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చుచేస్తున్నారు.విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రేపు చంద్రబాబు దీక్షకు దిగనున్నారు.ఇందుకోసం స్టేడియంలో ఏసీలు,సౌండ్ సిస్టమ్స్ ,టెంట్లు తో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.అంతేకాకుండా ఈ పనులను జిల్లా కలెక్టర్ ,పోలిస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.దీక్ష జరుగుతున్నంతసేపు అక్కడికి వచ్చిన ప్రజలకు భోజనాలు,మజ్జిక పంపిణి చెయ్యాలని అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి.
అయితే ఈ దీక్షకు బలవంతంగా విధ్యార్ధులను రాప్పించేలా కళాశాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.ప్రైవేట్ కళాశాల నుండి విధ్యార్ధులను తరలించేందుకు 190అర్టీసీ బస్సులు,140ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశారు.రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రస్తుత అధికార టీ డీ పీ ఎమ్మెల్యేలు దీక్షలు కొనసాగిస్తున్నారు.అంతేకాకుండా మీడియా ప్రకటనలు పబ్లిసిటికోసం సుమారు 20 కోట్లకు పైగా ఖర్చు అవుతున్నదని అంచన.అయితే ఏపీ కి ప్రత్యేక హోదా కోసం వై సీ పీ నేతలు దీక్ష చేస్తే..అర్టీసీ కి 12కోట్లు నష్టం వచ్చిందన్న చంద్రబాబు తన దీక్షకు 20కోట్లకు పైగా ఖర్చు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి