ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టుల పేరుతో ప్రచారం చేసుకోవడంపై మాత్రమే శ్రద్ధ పెడుతూ అసలు విషయాలను పక్కన పెట్టడంపై ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ టీం గట్టిగా ప్రచారం చేసుకునే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్ర చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని దాఖలైన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ స్వీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ జరిగింది. పిటిషనర్ జమ్ముల చౌదరయ్య దాఖలు చేసిన ఈ కేసుపై ఎన్జీటీ విచారణ జరిపింది.
see also :
ఫలించిన కేసీఆర్ ఆలోచన..కేటీఆర్ కార్యాచరణ..!!
నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పోలవరంలో అంతర్భాగం కాదని పిటిషనర్ పేర్కొన్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చేపడుతున్నారని తెలిపారు. 3,500 క్యూసెక్కులతో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని ఈ నేపథ్యంలో దీనికి పర్యావరణ అనుమతి తప్పనిసరి అని పిటిషన్లో తెలిపారు. అయితే చెన్నై బెంచ్‌లో నుంచి ఇక్కడి వచ్చినందున తమకు సమాచారం లేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిపై ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో రావాలని కోరుతూ వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణను మే 2కు వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో పురుషోత్తపట్నం నిర్వాసితులు కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. భూ సేకరణలో తమకు సరైన పరిహారం అందలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తద్వారా ఒకే రోజు న్యాయస్థానం ద్వారా బాబు సర్కారుకు రెండు మొట్టికాయలు తగిలినట్లయింది.
see also :