తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉందని సినీ నటుడు నాగబాబు అన్నారు .ఇవాళ అయన మీడియాతో అయన మాట్లాడుతూ..
ప్రతి సమస్యకు పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదన్నారు.అసలు పవన్ సినీ పరిశ్రమలో వేధింపులకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడం తప్పా? అని నాగబాబు ప్రశ్నించారు. ఎవరేమన్నా తమకు భరించే శక్తి ఉందన్నారు. విమర్శలను పట్టించుకోవద్దని అభిమానులకు పవన్ ఎప్పుడో చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సినీ ఇండస్ట్రీ లో మార్పు రావడానికి కొంత సమయం పడుతుందని..కొంతమంది చిల్లర వెధవలవల్లనే సినీ పరిశ్రమలకు చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు..గతంలో ఇలాంటివి తన దృష్టికి వస్తే ఇద్దరిని చెప్పుతో కొట్టానని ఈ సందర్భంగా గుర్తు చేసారు. మీ పట్ల ఎవ్వరైనా తప్పు చేసినవాళ్లను చెప్పుతో కొట్టి.. పోలీసులకు పట్టించండి అంటూ పిలుపునిచ్చారు.
గత కొన్ని రోజులనుండి శ్రీరెడ్డి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని..ఆమె పోరాటం పక్కదారి పట్టిందని అన్నారు. పేమెంట్స్, ఇతర విషయాల్లో సమస్యలు వస్తే పరిష్కరిస్తుందే తప్ప… సినిమాల్లో అందరికీ ‘మా’ అవకాశాలు ఇప్పించలేదని వివరించారు. ‘మా’ సభ్యత్వం కావాలంటే రూ. లక్ష చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ అంటే గౌవరవం ఉందికాబట్టే తన కూతురును తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకొచ్చానన్నారు.శ్రీ రెడ్డి తన తల్లిని తిడితే అడ కూతురు అని వదిలేశామని చెప్పారు.