తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో రూపొందించిన ప్రణాళికలు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమర్థ కార్యాచరణ వల్ల తెలంగాణ రాష్ట్రం ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రపంచంలోనే నంబర్ 2 హెలీకాప్టర్ కంపెనీ తమ కార్యకలాపాలను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడమే కాకుండా ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద హెలికాప్టర్ల తయారీదారుల్లో ఒకటైన కజాన్ హెలికాప్టర్స్ తెలంగాణలో తన యూనిట్‌ను స్థాపించేందుకు సుముఖత వ్యక్తంచేసింది. రష్యాలోని తాతార్‌స్థాన్ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బిజినెస్ ఫోరంలో సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రకటించారు.
see also :
సూర్యుడుని సైతం ఎదిరించగల సత్తా గల నాయకుడు జగన్..!!
నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..
తాతర్‌స్థాన్ రాష్ట్రం, తెలంగాణ ఏర్పాటు చేసిన బిజినెస్ ఫోరం సదస్సుకు తాతార్‌స్థాన్ అధ్యక్షుడు రుస్తమ్ మిన్నిఖనోవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలకు ఫిదా అయ్యారు. ఇక్కడి ఆకర్షణీయమైన వృద్ధి.. ఇరు రాష్ట్రాల మధ్య సహకార అవకాశాలను పెంచుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇంజినీరింగ్, డిఫెన్స్, ఏరోస్పేస్, పెట్రోకెమికల్స్, చమురు, సహజవాయువు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో పరస్పర సహకారం గురించి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇన్నోపోలిస్ యూనివర్సిటీ వైస్ రెక్టార్ ఇస్కందర్ బరియేవ్, ఐఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణ్‌లు కంప్యూటర్ సైన్స్, ఐటీ విద్యలో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు.
see also :