ఏపీ అధికార టీడీపీ పార్టీలో అసమ్మతి మొదలైందా ..సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా ..నాలుగు ఏండ్లుగా తమకు ..తము కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశపడిన వారికి నిరాశ ఎదురైందా..పార్టీలో తమకు ,తమ
సీనియారిటీకి ఎదురవుతున్న పలు అవమానాలను తట్టుకోలేక పార్టీకి గుడ్ బై చెప్పడమే మంచిదని భావిస్తున్నారా అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు ..
See Also:ఏపీలో పార్ధిగ్యాంగ్ హల్ చల్ ..అత్యంత క్రూరంగా కత్తులతో గొంతులు కోయడమేగాక..!
కర్నూల్ జిల్లాలోని కోయిలకుంట్ల అసెంబ్లీ నియోజక వర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే అప్పట్లో పార్టీ మారే సమయంలో బాబు ఇచ్చిన కొన్ని కమిట్మెంట్ల వలన ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు .అయితే పార్టీ మారి ఇన్నాళ్ళైన సరే తగిన గుర్తింపు ,గౌరవం ఇవ్వకపోవడమే కాకుండా ఏకంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఇచ్చి బాబు అవమానపరిచాడని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు .ఈ క్రమంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తనను ,డోన్ నియోజకవర్గంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లాంటి వార్ని ఎదుర్కున్న తనను ఇంతా ఘోరంగా అవమానపరుస్తారా అంటూ టీడీపీ పార్టీకి రాజీనామా చేయాలనీ తన అనుచవర్గం దగ్గర వాపోయారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
See Also:పవన్ కల్యాణ్, పూనమ్‌కౌర్ ముంబై హోటల్లో.. వారం రోజులు..! మసాజ్ వీడియో వైరల్..!!
అయితే టీడీపీ పార్టీలో చేరిన సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తాను అని ఇవ్వకపోవడం..ఆ సమయంలో ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కి ఆ ఎమ్మెల్సీ ఇవ్వడం ..ఇప్పుడు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవిచ్చి అవమానపరచడం ఇలా పలు సంఘటనలతో ఆయన కలత చెంది త్వరలోనే టీడీపీ పార్టీకి రాజీనామా చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు అంట .అయితే త్వరలో తన తనయుడి వివాహం ఉండటంతో ఆ వేడుకలు జరిగిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు .అందులో భాగంగా ఇప్పటికే కర్నూల్ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేతలు శిల్పా బ్రదర్స్ తో మంతనాలు జరిపారు అంట చల్లా …