తెలుగు సినీ ఇండస్ర్టీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వేధింపులపై సంచలన విషయాలను, ఫోటోలతో సహా ఆధారాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన శ్రీరెడ్డి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయింది. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అంటే నాకు ద్వేషమేమీ లేదు… అలా అని నేను ఆయన అభిమానిని కాదు.. ఆయనలో నాకు నచ్చేది.. తెలుగు వారిని ఎంకరేజ్ చేయడమే అని చెప్పిన శ్రీరెడ్డి.. మహిళలపై పవన్ చూపిస్తున్న అగౌరవాన్ని తప్పు పట్టింది.
తెర వెనుక చక్రం తిప్పుతున్న పవన్ ఆప్త మిత్రుడు..!!
తెలుగు సినీ ఇండస్ర్టీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న నన్ను అభినందించాల్సింది పోయి.. నీవు ఇలా చేయడం తప్పు.. పోలీసు స్టేషన్ మెట్లెక్కు.. కోర్టు మెట్లెక్కు అంటూ సూచనలు ఇవ్వడం దారుణమంది. అదే పవన్ కల్యాణ్ మొన్న ఒక్క రోజు ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం అంటూ ఒక రెండు కిలోమీటర్లు నడవ లేదా..? ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానిపై కేసు పెట్టలేడా..?
కోర్టుమెట్లక్కలేడా అంటూ ఎదురు ప్రశ్నించింది. మహిళలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న మాకు మద్దతు ప్రకటించాల్సింది పోయి.. పవన్ కల్యాణ్ ఎదురు ప్రశ్నించడం వెనుక ఆంతర్య మేమిటని మీడియా సాక్షిగా ఎదురు దాడి చేసింది శ్రీరెడ్డి. ఇంకో సారి అలా మాట్లాడితే అంటూ.. చెప్పు చూపించి మరీ.. పవన్‌ను దుర్భాషలాడింది శ్రీరెడ్డి.