ఏపీ అధికార టీడీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది .నిన్న కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దాదాపు మూడు వేలమందితో వైసీపీ కండువా కప్పుకున్నారు .నేడు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి త్వరలోనే వైసీపీ పార్టీలోకి
రానున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి .
See Also:కర్నూల్ టీడీపీలో మరో వికెట్ డౌన్ -వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే..!
రాష్ట్ర విభజన సమయంలో ఆనం బ్రదర్స్ ఒకరికి ఎమ్మెల్యే సీటు ,ఇంకొకరికి ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి పసుపు కండువా కప్పుకున్నారు.అయితే పార్టీ మారి నాలుగు ఏండ్లు అవుతున్న కానీ తన సోదరుడు అయిన ఆనం వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడమే కాకుండా ఆత్మకూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జ్ గా ఆనం రామనారాయణ రెడ్డికి కట్టబెట్టాడు బాబు .అయితే బాబు అయితే ఇంచార్జ్ పదవి ఇచ్చారు కానీ స్థానిక టీడీపీ నేతలు మాత్రం ఆనం బ్రదర్స్ ను అసలు కేర్ చేయడంలేదు …రానున్న ఎన్నికల్లో ఆనం కు టికెట్ ఇవ్వరని ఇటు జిల్లా పార్టీ వర్గాల్లో అటు టీడీపీ అధిష్టాన వర్గాల్లో వినిపిస్తుండటంతో ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు అంట .
See Also: ఏపీలో పార్ధిగ్యాంగ్ హల్ చల్ ..అత్యంత క్రూరంగా కత్తులతో గొంతులు కోయడమేగాక..!
అంతే కాకుండా నియోజకవర్గంలో ,జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ,ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆహ్వానం అందడంలేదు.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆనం బ్రదర్స్ లో ఒకరైన రామనారాయణ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ఆత్మకూర్ తన కార్యాలయంలో టీడీపీ ,చంద్రబాబు ఫ్లెక్సీలు ,ఫోటోలు తీయించేశారు .అందులో భాగంగానే తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి హైదరాబాద్ మహానగరంలో కిమ్స్ లో చికిత్స పొందుతున్నారని తెల్సి చంద్రబాబు నాయుడు వస్తే అప్పటిదాకా ఆస్పత్రిలోనే ఉన్న రామనారాయణ రెడ్డి బాబు వస్తున్నారని బయటకు వచ్చేశారు.అయితే తను వైసీపీలో చేరాలని ..అందుకు ఆత్మకూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇవ్వాలని జగన్ దగ్గర ప్రతిపాదించారు రామనారాయణ .జగన్ మాత్రం ఆత్మకూర్ కాకుండా వెంకటగిరి ఇస్తామని హామీ ఇవ్వడంతో రామనారాయణ పార్టీ మారడానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు అని ఆనం అనుచవర్గం అంటున్నారు . చూడాలి మరి ఆనం ఎప్పుడు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు వస్తారో ..
See Also:పవన్ కల్యాణ్, పూనమ్‌కౌర్ ముంబై హోటల్లో.. వారం రోజులు..! మసాజ్ వీడియో వైరల్..!!