టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్..! కుటుంబం.. కుటుంబం వైసీపీలోకి..!! అవును, ఏపీ మంత్రికి కి చెందిన కుటుంబం వైసీపీలో చేరనుంది. అందుకు సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. కాగా, 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ మంత్రితో రాజకీయ విభేదాలు తలెత్తడంతో కుటుంబం.. కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆ టీడీపీ మంత్రి ఎవరు..? ఆయన కుటుంబంలో రాజకీయ విభేదాలు ఎందుకు తలెత్తాయి..? వారు వైసీపీలో ఎందుకు చేరబోతున్నారు..? అన్న విషయాలను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. కింది విధంగా సమాచారం ఇచ్చారు. అయితే, రాజకీయ విశ్లేషకులు చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఆ మంత్రి కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధమైందన్న సమాచారం వాస్తవమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇక అసలు విషయానికొస్తే..!!
త్వరలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు సెగలు పట్టిస్తున్నాయి. పలు సర్వే సంస్థలతోపాటు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలు కూడా త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్తో ఏపీ ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారంటూ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పార్టీల సీనియర్ నాయకులు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే శనివారం కృష్ణా జిల్లాలలోకి ఎంటరైన జగన్ ప్రజా సంకల్ప యాత్రలో టీడీపీ నేత, కమ్మ నేత అయిన యలమంచిలి రవి వైసీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
అయితే, ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే, మంత్రి ఆది నారాయణరెడ్డి కుటుంబం కూడా వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైంది. దీంతో జమ్మలమడుగులో ఇప్పటికే టీడీపీ నేత రామసుబ్బారెడ్డితో వర్గపోరు పెట్టుకున్న ఆది నారాయణరెడ్డి ఇప్పుడు.. కుటుంబం.. కుటుంబం ఏకమై ఎదురు తిరగడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన ఆది నారాయణరెడ్డి తరువాతి కాలంలో సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానని పైకి చెప్తూ..లోపల మాత్రం డబ్బు మూటలకు ఆశపడి టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
ఆది నారాయణరెడ్డి టీడీపీలో చేరినప్పట్నుంచి.. తన రాజకీయ వారసుడు తన అన్న చదిపిరాళ్ల నారాయణరెడ్డి తనయుడు భూపేష్ అని పలు కార్యక్రమాల్లో చెప్తూ వచ్చారు. ఇలా చెప్పాడో లేదో.. మరోపక్క జమ్మమడుగు నియోజకవర్గంలో సెటిల్మెంట్లు అన్నీ తన భార్య, కొడుకు చూసుకునేలా బాధ్యతలు అప్పగించారు మంత్రి ఆది నారాయణరెడ్డి. అయితే, సొంత తమ్ముడే కదా..! అని నమ్మి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీచేసే అవకాశం కల్పిస్తే.. ఇప్పుడు తనను, తన కుమారురు భూపేష్‌ను రాజకీయ చిత్రపటంలో లేకుండా చేసేందుకు మంత్రి పదవిలో ఉండి కుట్రలు పన్నుతున్నారని ఆది నారాయణరెడ్డిపై నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల చదిపిరాళ్ల నారాయణరెడ్డి తన సహచరులతో మాట్లాడుతూ .. తన సోదరుడు.. మంత్రి ఆది నారాయణరెడ్డి టీడీపీలో చేరినప్పట్నుంచి.. చంద్రబాబులా వెన్నుపోటు రాజకీయాలు చేయడం ప్రారంభించారని, అన్నని అని కూడా చూడకుండా.. నాకే వెన్నుపోటు పొడిచాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని మంత్రి ఆది నారాయణరెడ్డిని ఎదుర్కొనేందుకు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు చదిపిరాళ్ల నారాయణరెడ్డి. అయితే, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునేందుకు చదిపిరాళ్ల నారాయణరెడ్డి కుటుంబం సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.