శ్రీరెడ్డి, టాలీవుడ్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి కారణమని బల్లగుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న వారంతా అలా అవకాశాలు చేజిక్కించుకున్న వారేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. అయితే, ఇప్పటికైనా తెలుగు సినీ ఇండస్ర్టీలోని అసోసియేషన్స్ అన్నీ కలిసి మహిళా నటుల భద్రతకు సంబంధించిన, జరుగుతున్న లైంగిక దాడులపై తగిన చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి మీడియా సాక్షిగా కోరింది.
అయితే, ఇదే సందర్భంలో శ్రీరెడ్డి టీవీ లైవ్‌లో ఉండగానే.. ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ ఛానెల్ యాంకర్ శ్రీరెడ్డి తండ్రిని సంప్రదించారు. శ్రీరెడ్డి తండ్రి మాట్లాడుతూ.. మా కుటుంబం అంతా శ్రీరెడ్డిని అమ్ములు అని ముద్దుగా పిలుచుకుంటాం. అటువంటిది తెలుగు సినీ ఇండస్ర్టీ మా అమ్ములను బలిపశువును చేసి ఆడుకున్నారు. మా అమ్ములు చేస్తున్న పోరాటం సినీ ఇండస్ర్టీలోని మహిళలకు రక్షణ కవచంగా మారుతుందని నేను భావిస్తున్నా.. అంతేకాకుండా పది మందికి కడుపునిండా అన్నం పెడుతుందని భావిస్తున్నా అంటూ చెప్పారు శ్రీరెడ్డి తండ్రి.
see also :
అభిరామ్..నువ్వు ఏంట్రా..! అసలు నీకు సిగ్గుందా..!! నన్ను ఎలా వాడుకున్నావో.. నాకు తెలుసు..!!
అనంతరం టీవీ లైవ్‌లోనే శ్రీరెడ్డితో మాట్లాడుతూ.. అమ్ములూ..!! ధర్మం నీ వైపు ఉందా..? అని అడగ్గానే.. స్పందించిన శ్రీరెడ్డి నాన్నా.. ధర్మం నా వైపే ఉంది. నేను నిజంగా చెప్తున్నా.. నేనేం తప్పు చేయలేదు. సినిమాల్లో నటించాలనే పిచ్చితో సినీ ఇండస్ర్టీలోకి వచ్చినప్పట్నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా నాన్నా అంటూ బోరున విలపించింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి తండ్రి మాట్లాడుతూ.. అమ్ములూ, ధర్మం నీవైపే ఉంటే గనుక.. కొంచెం లేటైనా సరే విజయం నిన్నే వరిస్తుంది. మన పక్కింటి వారంతా మమ్మల్ని కాకుల్లా పొడుస్తున్నారు. కాబట్టి మేమంతా యాత్రలకు వెళ్తున్నామంటూ టీవీ లైవ్‌లో బోరున విలపించారు శ్రీరెడ్డి తండ్రి.