ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత ..సీనియర్ మంత్రిగా యావత్తు ఒక్క జిల్లా ప్రజలనే కాకుండా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల సమర్ధుడు..అన్నిటికి మించి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న రాజకీయ నేత .ఇంతకూ ఎవరు అని అనుకుంటున్నారా ..రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన పెదకూరపాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి నాలుగు సార్లు ..గుంటూరు వెస్ట్ నుండి ఐదో సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ సీనియర్ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ .
See Also:పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
ఆయన రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.అయితే గత నాలుగు ఏండ్లుగా ఇటు టీడీపీ పార్టీతో కల్సి మిత్రపక్షంగా అధికారాన్ని ,పదవులను అనుభవించి ఇటివలే ఒకరికి ఒకరు గుడ్ బై చెప్పుకున్నారు.రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను తుంగలో తొక్కడంతో రాష్ట్రంలో ఇటు అధికార టీడీపీ ,అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీపై ఐదు కోట్ల ఆంధ్రుల్లో తీవ్రవ్యతిరేకత ఉంది .ఇలాంటి తరుణంలో రాజకీయాల్లో సీనియర్ నేత అయిన కన్నా తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు .
See Also:చంద్రబాబా మజాకా ..ఒక్కొక్కరికి 15నుండి20 లక్షల వరకు ..!
అందులో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన అనుచరుడితో కబురు పంపారు అంట .అయితే జగన్ కన్నా కోరిన హామీలకు భరోసా ఇవ్వడమే కాకుండా ఏకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గానికి మంచి ప్రాధాన్యత ఇస్తాను అని జగన్ హామీ ఇవ్వడంతో త్వరలోనే పాదయాత్ర చేస్తున్న జగన్ ను కల్సి తన నిర్ణయాన్ని తెలియజేస్తాడు అంట కన్నా ..ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కన్నా వర్గం .
See Also:ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న లగడపాటి తాజా సర్వే..పక్కా ఆధారాలు దరువు చేతిలో