ఆహారానికి ఘటుతో కూడిన రుచిని తీసుకురావడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను మిరియాలు అందిస్తాయి.మిరియాలలో పోషకాలు,యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణా లు మరియు యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉన్నాయి.మిరియాల పై పొరలో పైటో న్యుత్రియంట్ సమ్మేళనాలు ఉంటాయి.ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వల్ని విచ్చిన్నం చేయడంతో పాటు కొత్త కొవ్వు కణ నిర్మాణాన్ని నిరోధిస్తుంది.అంతేకాకుండా నల్ల మిరియాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ యొక్క సాంద్రతను పెంచుతాయి.
see also :శృంగారానికి ముందు వీటిని త్రాగితే..స్వర్గం చూస్తారు..!!
నల్ల మిరియాలలో ఉండే థర్మో జేనిక్ లక్షణాలు జీవక్రియల రేటును పెంచుతాయి.ఇందులో ఉండే పెపె రైన్ అనే అల్కలాయిద్ జీర్ణ వ్యవస్టలో ఎక్కువ మొత్తంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది.ఇది మనం తీసుకున్న ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చెయ్యడంలో సహాయపడుతుంది.
బ్లాక్ పెప్పర్ రక్తనాలల్లో ఏర్పడే కొవ్వును నిరోధిస్తా యి.అందువల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గడంతో పాటు గుండెకు రక్త సరఫరా బాగా జరిగి గుండె పోటు తగ్గించుకోవచ్చు.బ్లాక్ పెప్పర్ శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
see also :రాగి కంకణం ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!
అంతేకాకుండా మలబద్దకం మరియు కడుపులో ఏర్పడే గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది.వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడే జబ్బులు ,దగ్గు ,గొంతు నొప్పి వంటి సమస్యలను నివారిస్తుంది.అధిక ఒత్తిడి ,ఆందోళన వంటి లక్షణాలను తగ్గించేందుకు సహాయపడుతుంది.