ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఉంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.గత కొన్నాళ్లుగా ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరూ
ప్రత్యేక హోదా గురించి గల్లీ నుండి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు ..పోరాటాలు చేస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు నిన్న శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలు నిరవదికంగా వాయిదా పడటంతో తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి ..ఏపీ భవన్లో అమర నిరాహార దీక్షకు దిగారు.
See Also:తెరపైకి డ్రగ్స్ కేసు-స్టార్ హీరో ,స్టార్ దర్శకుడిపై కేసు నమోదు ..!
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు ,ప్రత్యేక హోదా ఉద్యమంపై తను చేయించిన ఇంటిల్ జెన్స్ రిపోర్టు తదితర అంశాల గురించి టీటీడీఎల్పీ భేటీ నిర్వహించారు.అయితే అందరూ వస్తారని భావించిన చంద్రబాబు నాయుడుకు ఏడుగురు మంత్రులు ,ఆరుగురు ఎమ్మెల్యేల నుండి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ తగిలింది.వైసీపీ నుండి టీడీపీలో చేరి మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు..మిగిలిన టీడీపీ మంత్రులు టీటీడీఎల్పీకి డుమ్మా కొట్టారు.అయితే ప్రస్తుతం జరుగుతున్నా తాజా రాజకీయ పరిస్థితులను భేరీజ్ వేసుకున్న సదరు మంత్రులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అయినట్లు ఒకవైపు గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ చేస్తున్న అలుపు ఎరగని పోరాటంతో ప్రత్యేక వస్తే ఆ క్రెడిట్ అంతా ఆ పార్టీకే దక్కుతుంది.
See Also:నడి రోడ్డు మీద శ్రీరెడ్డి చేసిన పనికి ..బట్టలు విప్పేసి మరి ..!
మనం ప్రత్యేక హోదా గురించి పోరాటాలు చేయకపోవడమే కాకుండా ఏకంగా యువభేరీ,ప్రత్యేక హోదా కోసం గర్జనలు ఇలా జగన్ నిర్వహించిన పలు సభలకు ప్రజలు రాకుండా అడ్డుకోవడమే కాకుండా ఏకంగా వాళ్ళపై కేసులు కూడా పెట్టిన మనం ఇప్పుడు ప్రజలంతా తిరగబడ్డారని అఖిల పక్షం అంటూ కాలయాపన చేయడం తమ రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావితం చూపిస్తుందని భావించిన సదరు మంత్రులు ఈ భేటీకి డుమ్మా కొట్టారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.అయితే ఏకంగా పార్టీ అధినాయకుడే స్వయంగా నిర్వహించిన భేటీకి వారు రాకపోవడం వెనక పలు రాజకీయ కారణాలున్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి ..
See Also:జగన్ పాదయాత్రలో భారీ అనుచరవర్గంతో వైసీపీలోకి మాజీ మంత్రి తనయుడు..!