ఏపీ లో వైసీపీ నేత వైఎస్ జగన్ కు అభిమానులు అంతకు అంత భారీగా పెరుగుతున్నారు. ముఖ్యంగా విధ్యార్థుల గుండెల్లో ఉండిపోయోలా ప్రత్యేకహోదా కోసం నిరంతరం గత 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా వైఎస్ జగన్ ప్రత్యేకహోదా తేస్తాడని ఏపీలో ప్రతి నిరుద్యోగికి,ప్రతి విద్యార్థికి నమ్మకం కలిగింది. ఇక తాజాగా ప్రజా సంకల్పయాత్ర సోమవారం గుంటూరు జిల్లా పేరేచర్ల శివారు నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ నడిచే రహదారి పొడవునా అభిమానులు ,అమ్మాయిలందరు కలసి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
మార్గమధ్యలో పలువురు కళాశాల విద్యార్థినులు జననేతతో కలిసి ‘అన్నా… ఒక్క సెల్ఫీ’అంటూ ఫొటోలు దిగారు. బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని జగన్ విద్యార్థినులను ఆశీర్వదించారు. తమ ప్రియతమ నేతతో ఫొటో దిగడంతో ఆ విద్యార్థినులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జగనన్నతో దిగిన ఫొటోలు సరిగా వచ్చాయా, లేదా అని ఆ విద్యార్థినులు మండుటెండను సైతం మర్చిపోయి సెల్‌ఫోన్‌లో ఫొటోలు చూసి మురిసిపోయారు.
మరోపక్క ‘జగన్ ఇచ్చిన పిలుపు విద్యార్థుల బాధ్యతను గుర్తు చేసింది. హోదా వచ్చేదాకా నిద్రపోం. అన్నకు తోడుగా ఉంటాం’ అని శ్రీరామ్‌నగర్ వద్ద బీటెక్ విద్యార్థిని లయ ఆవేశంతో కూడిన ఆలోచనతో చెప్పింది. దాదాపు వంద మంది విద్యార్థులు జగన్ పాదయాత్రలో నడిచారు. ఇటు రాష్ర్టంలో,అటు ఢిల్లిలో వైఎస్ జగన్ ఒక్కడే ప్రజల కోసం ,విద్యార్థుల కోసం నిరంతరం పోరాడే అత్యతం శక్తివంతమైన ప్రతి పక్షనేతగా చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ నేతలు అంటున్నారు.