ఆమె ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన మహిళా ఎంపీ ..అయితేనేమి అధికారం కోసం ..పార్టీ ఇచ్చే ప్రాజెక్టుల కోసం నమ్ముకున్న ప్రజలను ..ఎంపీగా గెలిపించిన పార్టీను మోసం చేసి టీడీపీ పార్టీలో చేరింది.ఇంతకూ ఎవరు అని అలోచిస్తున్నరా ఆమె ఎవరో కాదు ..ఆమె కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.ప్రస్తుతం ఆమె
అధికార టీడీపీ పార్టీలో చేరిన కొన్నాళ్ళు వార్తల్లో ఉన్నారు కానీ ఆ తర్వాత ఆమె జాడే లేకుండా పోయింది.
ఇది చదవండిఃఈ అమ్మాయిలు ఫోన్ లో ఏం చూస్తున్నారు. ..వారి కళ్లలో ఆనందం..మీకు తెలుసా..
ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నా ప్రత్యేక హోదా ఉద్యమాల పుణ్యమా అని మరల తెరపైకి వచ్చారు.అయితే ఈ సారి మాత్రం ఆమె ఏకంగా పార్టీ మారతారు అని వార్తలు వస్తున్నాయి.అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో .అసలు విషయానికి వస్తే ప్రస్తుతం గత పది రోజులుగా వైసీపీ ,టీడీపీ పార్టీలు కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తూ వస్తున్న సంగతి విధితమే.
ఇది చదవండిఃమరోసారి తెరపైకి అన్నదమ్ముళ్ల విభేదాలు-బాలయ్య వర్సెస్ హరికృష్ణ..!!
ఈ తరుణంలో ఆమె టీడీపీ పార్టీకి మద్ధతుగా పార్లమెంటులో నిలబడితే వైసీపీ పార్టీ తనపై సస్పెన్శన్ వేటు వేయమని కొరుతుంది.దీంతో తన పదవీ ఊడుతుంది.ఒకవేళ టీడీపీలో ఉంటే మరల గెలిచే అవకాశం లేదు..వైసీపీలోకి వేళ్ళే పరిస్థితి లేదు ..ఒకవేళ వెళ్ళిన జగన్ మరల సీటు ఇస్తాడని నమ్మకం లేదు .సో ఇలా జరగడం ఇష్టం లేక ఆమె పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు అంట.బీజేపీలో చేరితే ఎటువంటి సమస్య ఉండదని ఆమె అభిప్రాయం కావచ్చు మరి ..